బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జీకర్ మృతురాలి తల్లి విజయం

  • పానీహట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపు
  • టీఎంసీ అభ్యర్థిపై 28,836 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • రత్నాదేవనాథ్‌కు 50 శాతానికి పైగా ఓట్లు
ఆర్జీకర్ ఆసుపత్రి హత్యాచార ఘటనలో మృతి చెందిన జూనియర్ వైద్యురాలి తల్లి రత్నాదేవనాథ్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. పానీహట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆమె సమీప తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్థాంకర్ ఘోష్‌పై 28,836 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రత్నాదేవనాథ్‌కు 87,977 ఓట్లు రాగా, తీర్థాంకర్‌కు 59,141 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిగా ఆమె 50 శాతానికి పైగా ఓట్లు సాధించడం గమనార్హం.

దాదాపు రెండు దశాబ్దాలుగా పానీహట్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2001, 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నాయకుడు నిర్మల్ ఘోష్ వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు. ఈసారి తృణమూల్ పార్టీ బీజేపీ అభ్యర్థి రత్నాదేవనాథ్‌పై తీర్థాంకర్‌ను బరిలోకి దింపినప్పటికీ ఓటమి తప్పలేదు.

2024 ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి బరిలోకి దిగిన రత్నాదేవనాత్ ఎన్నికల ప్రచారంలో తన కూతురుపై జరిగిన దారుణాన్ని హైలెట్ చేశారు. "ఈరోజు నా కూతురుకు అన్యాయం జరిగింది. రేపు మరెవరి కూతురుకైనా జరగవచ్చు. ఇది ఒక తల్లిగా నా ఆవేదన" అంటూ ప్రజల్లోకి వెళ్లారు.

Ratna De
West Bengal Assembly Elections
Panihati Constituency
RG Kar Hospital
TMC
BJP
Nirmal Ghosh

More Telugu News